Bachula Arjunudu: విజయసాయిరెడ్డి దిగజారారు.. షరీఫ్ బాత్రూమ్ కు వెళ్తే డోర్ దగ్గరే నిల్చున్నారు: బచ్చుల అర్జునుడు

  • మతం పేరుతో షరీఫ్ ను బొత్స దూషించారు
  • మంత్రులు షరీఫ్ ను కదలకుండా చేశారు
  • షరీఫ్ ప్రజాస్వామ్యాన్ని రక్షించారు

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి దిగజారి ప్రవర్తిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మండిపడ్డారు. అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... మండలి ఛైర్మన్ షరీఫ్ బాత్రూమ్ కు వెళ్తే... విజయసాయిరెడ్డి బాత్రూమ్ డోర్ వద్దే నిల్చునే పరిస్థితికి దిగజారిపోయారని విమర్శించారు. ఇదే సమయంలో మంత్రి బొత్సపై ఆయన నిప్పులు చెరిగారు. మతం పేరుతో షరీఫ్ ను దూషించారని ఆరోపించారు. షరీఫ్ సీటుకు ఇరువైపులా ముగ్గురు మంత్రులు నిల్చుని... ఆయనను కదలకుండా చేశారని దుయ్యబట్టారు. ప్రభుత్వ ఒత్తిడిని తట్టుకుని మండలి ఛైర్మన్ గా షరీఫ్ ప్రజాస్వామ్యాన్ని రక్షించారని కితాబిచ్చారు.

Bachula Arjunudu
Vijayasai Reddy
Telugudesam
YSRCP
AP Legislative Council
Sharif
  • Loading...

More Telugu News