Amaravati: అమరావతి భూముల కొనుగోలుపై సీఐడీ కేసుల నమోదు.. విచారణకు నాలుగు బృందాల ఏర్పాటు
- ఇన్సైడర్ ట్రేడింగ్ పై సీఐడీ విచారణ షురూ
- తెల్ల రేషన్ కార్డులు కలిగిన 796 మందిపై కేసులు నమోదు
- ఎకరాన్ని రూ. 3 కోట్లకు కొన్నట్టు గుర్తించిన సీఐడీ
అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తున్న వైసీపీ ప్రభుత్వం... నిజాలను నిగ్గు తేల్చేందుకు సీఐడీని రంగంలోకి దించింది. ల్యాండ్ పూలింగ్ పై సీఐడీ కేసులను నమోదు చేసింది. తెల్ల రేషన్ కార్డు కలిగిన 796 మందిపై కేసులు నమోదు చేసినట్టు సమాచారం. వీరంతా ఎకరం భూమిని రూ. 3 కోట్లకు కొనుగోలు చేసినట్టు సీఐడీ గుర్తించినట్టు తెలుస్తోంది. రూ. 300 కోట్లతో భూములు కొనుగోలు చేసినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు సమాచారం. మరోవైపు, విచారణ కోసం నాలుగు బృందాలను సీఐడీ ఏర్పాటు చేసింది. వీరిలో ఎవరెవరు ఎవరెవరికి బినామీలు అని తేల్చే పనిలో సీఐడీ అధికారులు ఉన్నారు.