Rajani: అభిమానులను దృష్టిలో పెట్టుకుని చేసే హీరో రజనీకాంత్: బాబీ సింహా

  • రజనీ సార్ అంటే ఎంతో అభిమానం 'పేట' సినిమా నా ముచ్చట తీర్చింది
  • ఆయన నుంచి అదే నేర్చుకున్నానన్న బాబీ సింహా

తెలుగు .. తమిళ భాషల్లో బాబీసింహా విలక్షణమైన పాత్రలను చేస్తూ వెళుతున్నాడు. ఆయన ప్రతినాయకుడిగా నటించిన 'డిస్కోరాజా' రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ తో ఆయన బిజీగా వున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ రజనీకాంత్ గురించి ప్రస్తావించాడు.

మొదటి నుంచి కూడా నేను రజనీకాంత్ అభిమానిని. ఆయనతో కలిసి ఒక ఫ్రేమ్ లో కనిపించినా చాలు అనుకునేవాడిని. అలాంటిది ఆయనతో కలిసి 'పేట'లో నటించే అవకాశం వచ్చింది. కార్తీక్ సుబ్బరాజు నాకు ఆ సినిమాలో పెద్ద వేషమే ఇచ్చాడు. ఒక అందమైన అమ్మాయిని అబ్బాయిలు ఎలా గమనిస్తూ వుంటారో. ఆ సినిమా షూటింగు జరిగినన్ని రోజులు రజనీ సార్ ను అలా గమనించేవాడిని.

కథ .. కథనం .. తన పాత్రను గురించి మాత్రమే కాకుండా, ఒక సీన్లో ఎలా చేస్తే తన ఫ్యాన్స్ కి నచ్చుతుందనే విషయాన్ని కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని చేస్తారు. అలా ఫ్యాన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ ను కూడా దృష్టిలో పెట్టుకుని చేసే విధానాన్ని ఆయన దగ్గర నేర్చుకున్నాను" అని చెప్పుకొచ్చాడు.

Rajani
Bobby Simha
  • Loading...

More Telugu News