Andhra Pradesh: బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడంలో టీడీపీ సక్సెస్... ఇప్పటికిప్పుడు మూడు రాజధానుల అమలు కష్టమే: ప్రొఫెసర్ నాగేశ్వర్

  • సెలెక్ట్ కమిటీ ముందుకు వికేంద్రీకరణ బిల్లు
  • స్పందించిన ప్రొఫెసర్ నాగేశ్వర్
  • మూడు రాజధానుల నిలుపుదల తాత్కాలికమేనని వెల్లడి

ఏపీ శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవడం, దాన్ని సెలెక్ట్ కమిటీ ముందుకు పంపడంలో టీడీపీ విజయవంతమైందని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ వ్యాఖ్యానించారు. ఓ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించే అధికారం శాసనమండలికి ఉంటుందని, ఏదైనా బిల్లుపై మరింత లోతైన అధ్యయనం చేయాలని భావించినప్పుడు ఆ బిల్లును సెలెక్ట్ కమిటీ ముందుకు పంపుతారని వివరించారు. అందుకే సెలెక్ట్ కమిటీ ముందుకు వెళ్లిన బిల్లులు కనీసం రెండు మూడు నెలలు ఆలస్యం అవుతాయని తెలిపారు.

ఇప్పుడు వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిన నేపథ్యంలో ఇప్పటికిప్పుడు మూడు రాజధానుల ఏర్పాటు కష్టమేనని నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. మూడు రాజధానుల అమలు తక్షణమే జరగకుండా టీడీపీ ఆపగలిగిందని అన్నారు. కానీ ఫైనల్ గా మాత్రం అసెంబ్లీ నిర్ణయమే ఖరారవుతుందని అభిప్రాయపడ్డారు.

రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్ 169 ప్రకారం... శాసనమండలి ఎలాంటి ఆమోదం తెలపకపోయినా, రెండు సార్లు తిరస్కరించినా, నెల రోజుల పాటు దానిపై ఎలాంటి అభిప్రాయం వెల్లడించకపోయినా.... ఉభయ సభల ఆమోదం ఉందంటూ ఆ బిల్లును చట్టంగా మార్చుకునే అధికారం అసెంబ్లీకి ఉందని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News