Andhra Pradesh: బ్రేకింగ్ న్యూస్: సెలెక్ట్ కమిటీ ముందుకు వికేంద్రీకరణ బిల్లు!

  • విచక్షణాధికారంతోనే నిర్ణయం తీసుకున్నానని తెలిపిన చైర్మన్
  • తీవ్ర నిరసన వ్యక్తం చేసిన వైసీపీ
  • ఉదయం నుంచి జరిగిన వాదోపవాదాలకు తెర

వైసీపీ ప్రభుత్వానికి శాసనమండలిలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ చట్టం ఉపసంహరణ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని చైర్మన్ షరీఫ్ నిర్ణయం తీసుకున్నారు. తనకున్న విచక్షణాధికారంతోనే ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నానని షరీఫ్ తెలిపారు.

కాగా, చైర్మన్ నిర్ణయంపై మండలిలో అధికార వైసీపీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. టీడీపీ వర్గాలు మాత్రం హర్షం వ్యక్తం చేశాయి. ఉదయం నుంచి మండలిలో సెలెక్ట్ కమిటీ ముందుకు బిల్లులు పంపే విషయంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ఎవరి వాదనలు వారు వినిపించినా, చివరికి తన విచక్షణాధికారంతో చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు.

Andhra Pradesh
AP Legislative Council
Chairman
Shareef
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News