Pawan Kalyan: విలీనం.. విలీనం అంటారేంటి?: ఢిల్లీలో మీడియాతో పవన్ కల్యాణ్

  • ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బీజేపీ-జనసేన కూటమి
  • ‘పవన్ కల్యాణ్ గారు, విలీనం.. ’ అంటూ ప్రశ్న
  • ‘విలీనం అనే కాన్సెప్టే లేదు’ అన్న పవన్

కొత్తగా ఏర్పడ్డ బీజేపీ-జనసేన కూటమి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ని ఢిల్లీలో కలిసిన విషయం తెలిసిందే. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ భేటీకి సంబంధించిన వివరాలను బీజేపీ, జనసేన నేతలు వివరించారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆయా నేతలు సమాధానాలు ఇచ్చారు.

ఈ క్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ని మీడియా ఓ ప్రశ్న అడిగింది. ‘పవన్ కల్యాణ్ గారు.. విలీనం, అలయెన్స్ అన్నారు కదా, ఇదేమన్నా..’ అన్న ప్రశ్నకు పవన్ స్పందిస్తూ, ‘ఏంటీ విలీనం.. విలీనం అంటారు! మీరు ఇంటెన్షనల్ గా చెబుతున్నారా?.. విలీనం అనే కాన్సెప్టే లేదు కదా?’ అన్నారు. ‘కూటమి’ గురించి తాము చాలా స్పష్టంగా ఉన్నామని తెలిపారు. మధ్యలో కల్పించుకున్న బీజేపీ ఎంపీ జీవీఎల్ మాట్లాడుతూ, ‘అసలు ఆయన ఎక్కడ అన్నారు?’ అని ప్రశ్నించారు.

Pawan Kalyan
Janasena
BJP
Alliance
Merge
  • Loading...

More Telugu News