Galla Jayadev: గల్లా జయదేవ్ కు మద్దతుగా నిలిచిన రైతులకు కృతజ్ఞతలు తెలిపిన గల్లా అరుణ

  • రాజధానిలో పర్యటించిన గల్లా అరుణ
  • మందడంలో దీక్ష చేస్తున్న మహిళా రైతులకు మద్దతు
  • ఓ ఎంపీ అని కూడా చూడకుండా దాడి చేశారంటూ వ్యాఖ్యలు

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తల్లి  గల్లా అరుణ కుమారి రాజధాని అమరావతిలో పర్యటించారు. అసెంబ్లీ ముట్టడి సందర్భంగా తన కుమారుడు గల్లా జయదేవ్ కు మద్దతుగా నిలిచారంటూ రైతులకు, మహిళలకు గల్లా అరుణ కృతజ్ఞతలు తెలిపారు. గల్లా జయదేవ్ రాజధాని రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాడని, కానీ ఎంపీ అని కూడా చూడకుండా పోలీసులు దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

మందడంలో మహిళలు చేపడుతున్న దీక్ష శిబిరం వద్దకు వచ్చి అరుణ మాట్లాడుతూ, రైతులు ఆత్మాభిమానాన్ని చంపుకోవాల్సిన అవసరం లేదని, ఎవరి కాళ్లు పట్టుకోవాల్సిన అవసరంలేదని అన్నారు. రైతులకు సంఘీభావం ప్రకటించిన ఆమె రాజధాని రైతులు హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు శాశ్వతం కావన్న విషయాన్ని పోలీసులు గుర్తెరగాలని, పోలీసులను అడ్డుపెట్టుకుని ఉద్యమాన్ని దెబ్బతీయాలని ప్రభుత్వం భావిస్తోందని మండిపడ్డారు.

Galla Jayadev
Galla Aruna
Telugudesam
Andhra Pradesh
Amaravati
Farmers
YSRCP
Police
  • Loading...

More Telugu News