Sukumar: సరిగమలతో సుకుమార్ కి బర్త్ డే విషెస్ తెలిపిన కూతురు

  • ఈ నెల 11న పుట్టినరోజు జరుపుకున్న సుకుమార్ 
  •  కూతురు నుంచి అమూల్యమైన కానుక 
  • వీడియోను వదిలిన దేవిశ్రీ ప్రసాద్

టాలీవుడ్ అగ్రదర్శకులలో సుకుమార్ ఒకరుగా కనిపిస్తాడు. ఆయన ఎంచుకునే కథలు .. తెరపై వాటిని ఆవిష్కరించే తీరు భిన్నంగా ఉంటాయి. 'నాన్నకు ప్రేమతో' .. 'రంగస్థలం' వంటి భారీ విజయాలను అందుకున్న ఆయన, బన్నీ హీరోగా తన తదుపరి సినిమాకి సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 11వ తేదీన ఆయన తన 50వ పుట్టినరోజును జరుపుకున్నాడు.

ఈ సందర్భంగా సుకుమార్ కూతురు సుకృతి సరిగమలు ఆలపిస్తూ తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేసింది. ఈ రోజున సుకృతి పుట్టినరోజు కావడంతో, ఆమె పాడిన పాటకి సంబంధించిన వీడియోను దేవిశ్రీ ప్రసాద్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 'తండ్రి పుట్టినరోజున సుకృతి పాడిన పాటను .. తన పుట్టినరోజు సందర్భంగా నేడు విడుదల చేస్తున్నాం .. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నాను" అని రాసుకొచ్చారు. ఇప్పటికే సుకృతి ప్రతిభను అభినందిస్తూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Sukumar
Devisri
Sukruthi
  • Error fetching data: Network response was not ok

More Telugu News