Panchumarthi Anuradha: ఏ2 ముద్దాయికి శాసనమండలిలో ఏం పని?: పంచుమర్తి అనురాధ

  • ఎమ్మెల్సీలను ప్రలోభ పెట్టేందుకు యత్నిస్తున్నారు
  • విజయసాయి బెయిల్ ను రద్దు చేయాలి
  • చంద్రబాబు ఛాంబర్ లో టీవీ ప్రసారాలు కట్ చేశారు

నిన్న శాసనమండలి సమావేశాలు జరుగుతున్న సమయంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అక్కడ ఉండటంపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ, ఏ2 ముద్దాయి విజయసాయిరెడ్డికి అక్కడ ఏం పని? అని ప్రశ్నించారు. ఎవరినీ ప్రలోభాలకు గురి చేయకూడదని బెయిల్ షరతుల్లో ఉందని... కానీ, ఎమ్మెల్సీలను ప్రలోభ పెట్టేందుకు విజయసాయి యత్నిస్తున్నారని మండిపడ్డారు. విజయసాయిరెడ్డి బెయిల్ ను సీబీఐ కోర్టు రద్దు చేయాలని కోరారు.

ఏ1, ఏ2లు బెయిల్ పై ఉన్నామనే విషయాన్ని మర్చిపోకూడదని అనురాధ ఎద్దేవా చేశారు. ప్రజల కోట్లాది సొమ్మును విజయసాయిరెడ్డి కొట్టేశారని ఆరోపించారు. జగన్ రాజకీయ భవిష్యత్తు బాగుంటే కేసులు మాఫీ అవుతాయనే దురాలోచనలో విజయసాయి ఉన్నారని అన్నారు. మండలిలో కొన్ని చానళ్లను నిలిపివేయడం సరికాదని చెప్పారు. చంద్రబాబు చాంబర్ లో కూడా టీవీ ప్రసారాలను నిలిపివేశారని మండిపడ్డారు.

Panchumarthi Anuradha
Vijayasai Reddy
Jagan
Chandrababu
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News