Kishan Reddy: తెలంగాణ ప్రజలకి నా విన్నపం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • మునిసిపల్ ఎన్నికల్లో భారీ సంఖ్యలో పాల్గొనాలి
  • సమర్థవంతమైన అభ్యర్థులను ఎన్నుకోవాలి
  • ప్రతి స్థాయిలో సుపరిపాలన కావాలనుకుంటే ఓటు ఎంతో అవసరం 

తెలంగాణలో మునిసిపల్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఓటర్లందరూ తమ ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కోరారు.  

'నేటి తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో భారీ సంఖ్యలో పాల్గొని సమర్థవంతమైన అభ్యర్థులను ఎన్నుకోమని ఓటరు మహాశయులందరికి నా సవినయ మనవి. ప్రతి స్థాయిలో సుపరిపాలన, సమృద్ధి కావాలనుకుంటే మీ అమూల్యమైన ఓటు ఎంతో అవసరం' అని కిషన్ రెడ్డి తెలుగుతో పాటు ఇంగ్లిషులో ట్వీట్లు చేశారు. కాగా, పురపాలికల ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 36.63 శాతం పోలింగ్ నమోదయింది. 

Kishan Reddy
BJP
Telangana
Municipal Elections
  • Loading...

More Telugu News