Crime News: ప్రకాశం జిల్లా ఒంగోలులో గ్యాంగ్ రేప్?

  • వివస్త్రగా పడివున్న మహిళ 
  • ఆపస్మారక స్థితిలో ఉండగా గుర్తింపు 
  • స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి పోలీసులు

ప్రకాశం జిల్లా ఒంగోలు శివారుల్లో గ్యాంగ్ రేప్ జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేశవరాజు కుంట శివారులో ఓ మహిళ అపస్మారక స్థితిలో వివస్త్రగా పడివుండగా స్థానికులు గుర్తించారు. ఆమె పక్కన మహిళల లోదుస్తులు, కండోమ్స్, నల్లపూసల దండ పడివున్నాయి. స్పృహలేని స్థితిలో గాయాలతో మహిళ పడివుండడంతో ఎవరో ఆమెపై అత్యాచారం చేసి వదిలేసి ఉంటారని అనుమానిస్తున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. మహిళను ఆసుపత్రికి తరలించారు.

Crime News
Prakasam District
ongole
gangrape
  • Loading...

More Telugu News