Amala Paul: హీరోయిన్ అమలాపాల్ ఇంట విషాదం.. తండ్రి మృతి

  • అమలాపాల్ తండ్రి వర్గీస్ పాల్ హఠాన్మరణం
  • కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వర్గీస్
  • హుటాహుటిన చెన్నై నుంచి కేరళ బయల్దేరిన అమలాపాల్

సినీ హీరోయిన్ అమలాపాల్ ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి వర్గీస్ పాల్ హఠాత్తుగా మరణించారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తండ్రి మరణవార్తతో అమలాపాల్ కన్నీటిపర్యంతమైంది. ఓ సినిమా షూటింగ్ లో ఉన్న ఆమె హుటాహుటిన చెన్నై నుంచి కేరళ బయల్దేరింది. ఈరోజు వర్గీస్ పాల్ అంత్యక్రియలను నిర్వహించనున్నారు.

'బెజవాడ' సినిమాతో టాలీవుడ్ లో అమలాపాల్ ఎంట్రీ ఇచ్చింది. రామ్ చరణ్ తో కలిసి నటించిన 'నాయక్' ఆమెకు మంచి నటిగా గుర్తింపును తీసుకురాగా... అల్లు అర్జున్ తో కలసి చేసిన 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం ఆమెకు స్టార్ డమ్ ను తీసుకొచ్చింది. తెలుగుతో పాటు, తమిళం, మలయాళ సినిమాలతో ఆమె బిజీగా ఉంటోంది.

కెరీర్ టాప్ లెవెల్ లో కొనసాగుతున్న సమయంలో తమిళ దర్శకుడు విజయ్ ను ఆమె ప్రేమించి, పెళ్లాడింది. అయితే, ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో వారు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆమెకు ఆశించిన స్థాయిలో సినిమా అవకాశాలు రాలేదు. ఇప్పుడిప్పుడే ఆమె వరుసగా సినిమాలు చేస్తూ జోష్ పెంచింది. ఇలాంటి సమయంలో తండ్రిని కోల్పోవడం బాధాకరం.

Amala Paul
Tollywood
  • Loading...

More Telugu News