Hyderabad: హైదరాబాద్‌లోని లలిత జువెల్లరీలో ఆభరణాల చోరీ

  • ఈ నెల 15న ఘటన
  • కొనుగోలుదారుల్లా గుంపుగా షాపులోకి
  • సిబ్బంది దృష్టి మరల్చి చోరీ

హైదరాబాద్‌, పంజాగుట్టలోని లలిత జువెల్లరీలో చోరీ జరిగింది. సిబ్బంది దృష్టిని మరల్చిన దొంగలు ఆభరణాలను దోచుకెళ్లారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 15న సాయంత్రం కొందరు వ్యక్తులు గుంపుగా షాపులోకి వచ్చారు. వినియోగదారుల్లా నటిస్తూ ఆభరణాలను చూశారు. ఈ క్రమంలో అక్కడి సిబ్బంది దృష్టి మరల్చి రెండు బంగారు గొలుసులు, బ్రాస్‌లెట్‌ను చోరీ చేశారు. వీటి విలువ రూ.3.5 లక్షలు ఉంటుందని అంచనా. ఆభరణాలు చోరీ అయిన విషయం ఆడిట్‌లో బయటపడింది. దీంతో సీసీ కెమెరాలను పరిశీలించగా గుంపుగా వచ్చిన వారిలోనే ఎవరో ఆభరణాలను మాయం చేసినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad
Lalitha Jewellers
theft
  • Loading...

More Telugu News