: శ్రీశాంత్ ల్యాప్ టాప్ నిండా సినీతారలు, మోడల్స్ ఫొటోలే!: ముంబయి క్రైమ్ బ్రాంచ్


స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయిన కేరళ పేసర్ శ్రీశాంత్ లాప్ టాప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐపీఎల్ లో ఫిక్సింగ్ కు పాల్పడినట్టు తేలడంతో పోలీసులు ఈ స్పీడ్ స్టర్ ను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం అతని హోటల్ గదిలో సోదా చేయగా, ఓ ల్యాప్ టాప్, ఖరీదైన సెల్ ఫోన్, ఐ-పాడ్, రూ.72,000 నగదు లభ్యమయ్యాయి. కేసులో మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు గాను శ్రీశాంత్ ల్యాప్ టాప్ ను పరిశీలించిన ముంబయి క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఆశ్చర్యపోయారు. దాంట్లో పెద్ద సంఖ్యలో శ్రీశాంత్.. సినీతారలు, మోడళ్ళతో కలిసివున్న ఫొటోలే ఉన్నాయట.

స్పాట్ ఫిక్సింగ్ తో మోడళ్ళకు, తారలకు ఏమైనా సంబంధం ఉందేమో అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఆ అధికారులు వెల్లడించారు. ఈ అంగనలు బుకీలు ఏర్పాటు చేసిన పార్టీలకు హాజరై ఉంటారని వారు అనుమానిస్తున్నారు. అందుకే శ్రీశాంత్ బస చేసిన హోటల్ వద్ద సీసీటీవీ చిత్రాలను వీక్షిస్తే.. ఈ కేరళ క్రికెటర్ వద్దకు రాకపోకలు సాగించిన అతివలెవరో స్పష్టం అవుతుందని క్రైమ్ బ్రాంచ్ వర్గాలు భావిస్తున్నాయి. శ్రీశాంత్, చండీలా వద్దకు పలుమార్లు అమ్మాయిలను పంపామని బుకీలు విచారణలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ మగువలెవరో తేల్చేపనిలో పడ్డారు ముంబయి పోలీసులు.

  • Loading...

More Telugu News