Telangana: నేడు తెలంగాణలో ఉద్యోగులు, కార్మికులకు సెలవు

  • నేడు 120 మునిసిపాలిటీలు, 9 కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికలు
  • ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో సెలవు
  • 24న కరీంనగర్‌లో సెలవు

తెలంగాణలో నేడు మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తెలంగాణ ఫ్యాక్టరీస్, ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులకు ఇది వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. నేడు 120 మునిసిపాలిటీలు, 9 కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ నెల 24న కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 58 డివిజన్‌లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రోజున అక్కడ కూడా సెలవు ప్రకటిస్తూ కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Telangana
Telangana Municipal Elections
holiday
  • Loading...

More Telugu News