Telangana: తెలంగాణలో రాజకీయాలను డబ్బు శాసిస్తోంది: లక్ష్మణ్
- ధనరాజకీయాలపై లక్ష్మణ్ ఆవేదన
- హైదరాబాదులో ఎస్సీ కమిషన్ ఆధ్వర్యంలో సదస్సు
- స్వేచ్ఛ కోసం ప్రశ్నిస్తున్న గొంతులను నొక్కేస్తున్నారని వ్యాఖ్యలు
హైదరాబాదు రవీంద్రభారతిలో జాతీయ ఎస్సీ కమిషన్ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, విద్యాభివృద్ధి, రిజర్వేషన్ పాలసీ అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ జాతీయస్థాయి సదస్సులో తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో స్వేచ్ఛ కోసం నినదిస్తున్న గొంతుకలను నొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో రాజకీయాలను డబ్బు శాసిస్తోందని, ధన రాజకీయాలు చేయడం అప్రజాస్వామికమని అన్నారు. దేశంలో మిగతా పార్టీల్లో కంటే బీజేపీలోనే ఎక్కువమంది దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారని వెల్లడించారు.