Telugudesam: టీడీపీ నేత సోమిరెడ్డికి ఊరట... క్రిమినల్ కేసును కొట్టివేసిన హైకోర్టు

  • వెంకటాచలం పీఎస్ లో సోమిరెడ్డిపై కేసు
  • సోమిరెడ్డిపై ఫోర్జరీ ఆరోపణలు
  • అప్పట్లోనే అన్ని డాక్యుమెంట్లు చూపించిన మాజీ మంత్రి
  • హైకోర్టులో పిటిషన్ దాఖలు

నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై నమోదైన క్రిమినల్ కేసును హైకోర్టు కొట్టివేసింది. ఇడిమేపల్లి భూముల విషయంలో ఆయనపై ఫోర్జరీ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పలు సెక్షన్ల కింద సోమిరెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. సదరు భూములకు సంబంధించి అన్ని డాక్యుమెంట్లను సోమిరెడ్డి మీడియా ముఖంగా ప్రదర్శించారు. తనపై తప్పుడు కేసు పెట్టారంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించగా, ఆయన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం కేసును కొట్టివేసింది. అప్పట్లో సోమిరెడ్డిని వెంకటాచలం పీఎస్ లో నాలుగున్నర గంటలపాటు విచారించారు.

Telugudesam
Somireddy Chandra Mohan Reddy
Nellore District
Venkatachalam
High Court
Criminal Case
  • Loading...

More Telugu News