Stalin: మాట్లాడే ముందు మరొకసారి ఆలోచించి మాట్లాడాలి: రజనీకాంత్ కు స్టాలిన్ సూచన

  • పెరియార్ పై రజనీకాంత్ అభ్యంతరకర వ్యాఖ్యలు
  • తన స్నేహితుడు రజనీ రాజకీయ నాయకుడు కాదన్న స్టాలిన్
  • పెరియార్ లాంటి వారి గురించి మాట్లాడేముందు ఆలోచించాలంటూ సూచన

ద్రవిడ పితిమహుడు పెరియార్ పై రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో డీఎంకే అధినేత స్టాలిన్ మాట్లాడుతూ, తన స్నేహితుడు రజనీకాంత్ రాజకీయ నాయకుడు కాదని చెప్పారు. రజనీ ఓ నటుడని అన్నారు. పెరియార్ లాంటి వాళ్ల గురించి మాట్లాడేటప్పుడు మరొకసారి ఆలోచించి మాట్లాడాలని కోరుతున్నానని అన్నారు.

1971లో ఓ ర్యాలీలో నగ్నంగా ఉన్న సీతారాముల విగ్రహాలను పెరియార్ ఊరేగించారని రజనీకాంత్ వ్యాఖ్యానించినట్టు ఓ పత్రికలో వచ్చింది. దీంతో, ద్రవిడర్ విడుదలై కజగం పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెరియార్ ప్రతిష్ట దెబ్బతినేలా రజనీ వ్యాఖ్యానించారని మండిపడింది. రజనీ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. అయితే, క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని రజనీ తెగేసి చెప్పడం కొసమెరుపు.

Stalin
Rajinikanth
Periyar
DMK
  • Loading...

More Telugu News