Rajendra Prasad: అనిల్ రావిపూడిలో మంచి నటుడు కూడా వున్నాడు: రాజేంద్రప్రసాద్

  • అనిల్ రావిపూడి మంచి రచయిత 
  • పూర్తి క్లారిటీతో వుండే దర్శకుడు 
  • ప్రతి సీన్ చేసి చూపిస్తాడన్న రాజేంద్రప్రసాద్ 

హాస్య కథానాయకుడిగా ఒక వెలుగు వెలిగిన రాజేంద్రప్రసాద్, ఈ మధ్య కాలంలో కేరక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యారు. రీసెంట్ గా ఆయన చేసిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలోని పాత్ర కూడా ఆయనకి మంచి పేరును తెచ్చిపెట్టింది. తాజాగా ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, "అనిల్ రావిపూడిలో మంచి రచయిత వున్నాడు .. ఆయనలో మంచి సమయస్ఫూర్తి వుంది. సెట్లో అప్పటికప్పుడు డైలాగ్స్ ను .. పంచ్ లను చకచకా మార్చేస్తుంటాడు.

దర్శకుడిగా తనకంటూ ఒక విజన్ వుంది. ఎవరెంత టెన్షన్ పెట్టినా, తాపీగా ఆయన తను అనుకున్నది చేసుకుంటూ వెళుతుంటాడు. ఈ వయసులో ఆయన ఇంత నిబ్బరంగా ఉండటం చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఇక ఆయనలో మంచి నటుడు కూడా వున్నాడు. ప్రతి సన్నివేశాన్ని ఆయన 'ఇలా చేయాలి' అని చేసి చూపిస్తుంటాడు. నా కెరియర్లో నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే దర్శకులలో ఆయన ఒకరు" అని చెప్పుకొచ్చారు.

Rajendra Prasad
Anil Ravipudi
  • Loading...

More Telugu News