Galla Jayadev: గల్లా జయదేవ్ కు బెయిల్ నిరాకరణ... జైలుకు తరలింపు!

  • నిన్న జయదేవ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
  • నాన్ బెయిలబుల్ కేసుల నమోదు 
  • గుంటూరు సబ్ జైలుకు తరలింపు 

అసెంబ్లీని ముట్టడించేందుకు బయలుదేరిన గుంటూరు ఎంపీ, తెలుగుదేశం పార్టీ నేత గల్లా జయదేవ్ ను పోలీసులు గుంటూరు సబ్ జైలుకు తరలించారు. నిన్న పోలీసులు ఆయనపై పలు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఆపై ఆయన్ను వివిధ స్టేషన్లు తిప్పుతూ అర్ధరాత్రి దాటిన తరువాత మంగళగిరి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. తనకు బెయిల్ ఇవ్వాలని జయదేవ్ చేసిన అభ్యర్థనను తిరస్కరించిన మేజిస్ట్రేట్, 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో తెల్లవారుజాము సమయంలో గుంటూరు సబ్ జైలుకు గల్లా జయదేవ్ ను తరలించారు. ఈ ఉదయం ఆయన మరోసారి బెయిల్ పిటిషన్ ను దాఖలు చేయనున్నారు.

అంతకుముందు ఓ పోలీస్ స్టేషన్ లో చిరిగిన తన చొక్కాను తొలగించిన గల్లా జయదేవ్, పోలీసుల దాడిలో తనకు తగిలిన గాయాలను మీడియాకు చూపించారు. ఎంపీనన్న గౌరవం కూడా ఇవ్వకుండా, పోలీసులు తనపై దాడి చేశారని ఆరోపించారు.

Galla Jayadev
Non Bailable
Case
Jail
Arrest
Police
Amaravati
  • Loading...

More Telugu News