Kishan Reddy: సీఎం నేనే కావచ్చు.. లేదా సామాన్య కార్యకర్త కూడా కావచ్చు!: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

  • 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది
  • సీఎం అభ్యర్థి ఎవరనేది పార్టీ అధిష్ఠానమే నిర్ణయిస్తుంది
  • తాను సీఎం అభ్యర్థంటూ జరుగుతోన్న ప్రచారం వట్టిదే

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం రేపుతున్నాయి. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

అయితే సీఎం అభ్యర్థి ఎవరనేది పార్టీ అధిష్ఠానమే నిర్ణయిస్తుందన్నారు.‘నేనే సీఎం కావచ్చు లేదా సాధారణ కార్యకర్త అయినా సీఎం కావచ్చు’ అని చెప్పారు. ఇటీవల తాను సీఎం అభ్యర్థంటూ జరుగుతోన్న ప్రచారం కల్పితమన్నారు. ఇదిలా వుండగా, కిషన్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారాయి.

Kishan Reddy
BJP
Telangana Municipal Elections
Next CM
  • Loading...

More Telugu News