Rohit Sharma: నా బౌలింగ్ లో సచిన్ కొట్టిన షాట్ ను నువ్వు మరోసారి తలపించావ్: షోయబ్ అఖ్తర్

  • రోహిత్ లైన్లోకి వస్తే ఆపడం చాలా కష్టం
  • అతను కొట్టిన అప్పర్ కట్ షాట్ అద్భుతం
  • నా బౌలింగ్ లో సచిన్ కొట్టిన ఆ షాట్ ఇప్పటికీ గుర్తుంది

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించి సిరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. భారత ఓపెనర్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి మరో శతకాన్ని నమోదు చేశాడు. ఈ సందర్భంగా రోహిత్ కొట్టిన సిక్సర్లు క్రికెట్ అభిమానులను అలరించాయి. కమ్మిన్స్ బౌలింగ్ లో కొట్టిన అప్పర్ కట్ సిక్సర్ మ్యాచ్ కే హైలైట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో రోహిత్ పై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అఖ్తర్ ప్రశంసలు కురిపించాడు.

'రోహిత్ లైన్లోకి వచ్చాడంటే అతన్ని ఆపడం చాలా కష్టం. బౌలర్లను చిత్తుగా బాదుతాడు. అతను కొట్టిన అప్పర్ కట్ షాట్ అద్భుతం. గతంలో నా బౌలింగ్ లో సచిన్ కొట్టినట్టు ఇప్పుడు రోహిత్ కొట్టాడు. ఆ షాట్ నాకు ఇప్పటికీ గుర్తుంది. దాన్ని నీవు మరోసారి తలపించావ్' అని షోయబ్ అఖ్తర్ ప్రశంసలు కురిపించాడు.

Rohit Sharma
Sachin Tendulkar
Shoaib Akhtar
  • Loading...

More Telugu News