Kanna Lakshminarayana: మీ తుగ్లక్ పాలనలో రాష్ట్రం తలకిందులైన తాబేలులా తయారయ్యింది: కన్నా లక్ష్మీనారాయణ

  • రాష్ట్ర భవిష్యత్తును అయోమయంలోకి నెట్టేశారు
  • పరిపాలన వికేంద్రీకరణ జరగకూడదు
  • అమరావతిలోని నిర్మాణాలకు ఏం సమాధానం చెపుతారు?

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నిప్పులు చెరిగారు. మీ తుగ్లక్ పాలనలో రాష్ట్ర పరిస్థితి తలకిందులైన తాబేలులా తయారైందని విమర్శించారు. పరిపాలన వికేంద్రీకరణ అంటూ అసెంబ్లీ వేదికగా రాష్ట్ర భవిష్యత్తును తీవ్ర అయోమయంలోకి నెట్టేశారని మండిపడ్డారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కాని, పరిపాలన వికేంద్రీకరణ కాదని అన్నారు. అమరావతిలో ఇప్పుడున్న నిర్మాణాలకు, వాటాదారులకు ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. దీంతో పాటు తలకిందులైన తాబేలు ఫొటోను జత చేశారు. మరోవైపు, బీజేపీ హైకమాండ్ ఆదేశాల మేరకు కన్నా లక్ష్మీనారాయణ ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే.

Kanna Lakshminarayana
Jagan
BJP
YSRCP
  • Loading...

More Telugu News