Vijay Devrakonda: 'ఫైటర్'ను రంగంలోకి దింపిన పూరి

  • ముంబైలో పూజా కార్యక్రమాలు 
  • తెలుగుతో పాటు హిందీలోను నిర్మాణం 
  • కథానాయికగా 'అనన్య పాండే' పరిచయం  

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా 'ఫైటర్' రూపొందనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. తాజాగా ఈ రోజున ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. పూరి జగన్నాథ్ .. చార్మిలతో కలిసి కరణ్ జొహార్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అందువలన ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలోను నిర్మిస్తున్నారు.

కొంతసేపటి క్రితం ముంబైలో ఈ సినిమాను లాంచ్ చేశారు. పూరి జగన్నాథ్ కి ఇది 37వ సినిమాకాగా, విజయ్ దేవరకొండకి ఇది 10వ సినిమా. ఇటు పూరి జగన్నాథ్ కి .. అటు విజయ్ దేవరకొండకి యూత్ లోను .. మాస్ ఆడియన్స్ లోను మంచి క్రేజ్ వుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఈ సినిమా రూపొందుతుండటం పట్ల అందరూ ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా 'అనన్య పాండే' పేరు వినిపిస్తోంది.

Vijay Devrakonda
Ananya Pandey
  • Loading...

More Telugu News