Madhya Pradesh: తన జుట్టు పట్టుకుని లాగిన బీజేపీ నేత చెంప చెళ్లుమనిపించిన మహిళాధికారి... వీడియో ఇదిగో!

  • రాజ్ గఢ్ జిల్లాలో సీఏఏ అనుకూల ర్యాలీ
  • అనుమతి లేదంటూ అడ్డుకున్న పోలీసులు
  • డిప్యూటీ కలెక్టర్ జుట్టు పట్టుకుని లాగిన బీజేపీ నేత

సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం)కు అనుకూలంగా మధ్యప్రదేశ్ లోని రాజ్ గఢ్ జిల్లా ప్రధాన రహదారిపై బీజేపీ చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారగా, పరిస్థితిని అదుపు చేసేందుకు అక్కడికి వెళ్లిన డిప్యూటీ కలెక్టర్ ప్రియావర్మ చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ర్యాలీకి ముందస్తు అనుమతి లేకపోవడంతో పోలీసులు బీజేపీ కార్యకర్తలను అడ్డుకోగా, వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

విషయం తెలుసుకున్న ప్రియావర్మ అక్కడికి రాగా, ఓ వ్యక్తి, ఆమెను జుట్టుపట్టుకుని లాగి, దాడి చేశాడు. ఆ వెంటనే పోలీసులు ఆమెను రక్షించగా, కాసేపటికే తన జుట్టును లాగిన వ్యక్తిని ప్రియావర్మ గుర్తించారు. మహిళపై అసభ్యకరంగా ప్రవర్తిస్తావా? అంటూ, అతని చెంప పగులగొట్టారు. ఈ ఘటనపై పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన మధ్యప్రదేశ్ సర్కారు, నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించింది.

Madhya Pradesh
Priyavarma
Deputy Collector
Hair
BJP
  • Error fetching data: Network response was not ok

More Telugu News