Nalgonda District: ఓట్ల కోసం అభ్యర్థి మాస్టర్ ప్లాన్... నల్గొండ జిల్లాలో ఊరంతా ఖాళీ!

  • ఓటర్లను తరలించి, సమస్త సౌకర్యాలు
  • నల్గొండ జిల్లా చండూరు మండలంలో ఘటన
  • నేటితో ప్రచారానికి తెర

అది నల్గొండ జిల్లా చండూరు మండలం లకినేని గూడెం. ఇక్కడి మూడో వార్డు పరిధిలో దాదాపు 800 మందికి పైగా నివాసం ఉంటుండగా, సుమారు 520 ఓట్లు ఉన్నాయి. ఇక తెలంగాణలో స్థానిక ఎన్నికలు జరుగుతున్న వేళ, ఆయా పార్టీలు ఓట్ల కోసం అందరినీ గ్రామం నుంచి తరలించడంతో ఇప్పుడా గ్రామం బోసిపోయింది.

ఓటర్లను సమీపంలోని కోళ్లఫామ్ లకు తరలించిన అభ్యర్థులు, వారికి అవసరమైన సమస్త సౌకర్యాలనూ కల్పిస్తున్నారు. నిన్న ఉదయం ఓటర్లను తరలించిన అభ్యర్థులు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి విందు, ఆపై మద్యం తదితరాలను సరఫరా చేసినట్టు సమాచారం. ఇక మందు కొట్టిన తరువాత ఎవరైనా వివాదాలకు దిగుతారని భావించిన అభ్యర్థులు, వారిని గ్రూపులుగా విడదీసి, దూరంగా ఉండే ఇతర షెడ్లలో విశ్రాంతి ఏర్పాట్లను చేశారట. కాగా, తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుండగా, రెండు రోజుల్లో పోలింగ్ జరుగనున్న సంగతి తెలిసిందే.

Nalgonda District
Chanduru
Lakkireddy Gudem
Telangana
Municipal Elections
  • Loading...

More Telugu News