Telangana: కాంగ్రెస్ అభ్యర్థులను బెదిరిస్తే టీఆర్ఎస్ నేతలను వదిలిపెట్టను: రేవంత్ రెడ్డి

  • కుత్బుల్లాపూర్ పరిధిలో రేవంత్ ఎన్నికల ప్రచారం
  • టీఆర్ఎస్ టికెట్లన్నీ కబ్జాదారులకే ఇచ్చారని వెల్లడి
  • మంత్రి మల్లారెడ్డి ఒక్కో టికెట్ రూ.50 లక్షలకు అమ్ముకున్నారని ఆరోపణ

తెలంగాణలో పురపాలక ఎన్నికల సందర్భంగా వాడీవేడి వాతావరణం నెలకొంది. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటలయుద్ధం జోరుగా సాగుతోంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీచేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులను బెదిరిస్తే టీఆర్ఎస్ నేతలను వదిలిపెట్టనని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్లన్నీ కబ్జాదారులకే కేటాయించారని తెలిపారు.. మంత్రి మల్లారెడ్డి ఒక్కో టికెట్ ను రూ.50 లక్షలకు అమ్ముకున్నారని రేవంత్ ఆరోపించారు.

Telangana
Municipal Elections
Revanth Reddy
Congress
TRS
  • Loading...

More Telugu News