Andhra Pradesh: అమరావతిని కేంద్రం ఆమోదంతోనే తరలిస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు: వైసీపీ, టీడీపీపై పవన్ కల్యాణ్ ఫైర్

  • వైసీపీ, టీడీపీలపై పవన్ వ్యాఖ్యలు
  • పుకార్లు వ్యాప్తిచేస్తున్నారంటూ ట్వీట్
  • తీవ్రంగా ఖండిస్తున్నట్టు వెల్లడి

ఏపీ రాజధానిని కేంద్రం ఆమోదంతోనే తరలిస్తున్నట్టు అటు అధికార పక్షం, ఇటు ప్రధాన ప్రతిపక్షం పుకార్లు వ్యాప్తిచేస్తున్నాయని జనసేనాని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. రాజధాని మార్పుకు కేంద్రం అంగీకరించిందన్నది ఓ అబద్ధమని స్పష్టం చేశారు. ఇలాంటి దుష్ప్రచారాన్ని తాము గట్టిగా ఖండిస్తున్నట్టు పవన్ ట్వీట్ చేశారు. ఈ మేరకు ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ దేవధర్ పోస్టును ఉదహరించారు. సునీల్ దేవధర్ తన పోస్టులో జగన్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

అమరావతి నుంచి రాజధానిని తరలించాలని ఏకపక్షంగా వ్యవహరిస్తున్న జగన్ ప్రభుత్వ విధానాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. తాము తీసుకున్న మూర్ఖపు నిర్ణయాన్ని సమర్థించుకోలేక దానిపై కేంద్రంతో చర్చించామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని దేవధర్ ఆరోపించారు. అటు చంద్రబాబునాయుడు, ఇటు వైఎస్ జగన్ అబద్ధాల ప్రచారంలో దొందూ దొందేనని విమర్శించారు.

Andhra Pradesh
Amaravati
AP Capital
Pawan Kalyan
Chandrababu
Jagan
Telugudesam
YSRCP
Janasena
BJP
Sunil Deodhar
  • Error fetching data: Network response was not ok

More Telugu News