India: ఎయిర్ టెల్ రూ.179 ప్లాన్ తో లైఫ్ ఇన్సూరెన్స్... ఎలాంటి పత్రాలు అవసరంలేదు!

  • మొబైల్ ఆపరేటర్ల మధ్య పోటీ
  • వినూత్న ప్లాన్లతో యూజర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నం
  • రూ.2 లక్షల బీమాతో ఎయిర్ టెల్ కొత్త ప్లాన్

భారత్ టెలికాం రంగంలో జియో ప్రవేశం తర్వాత విప్లవాత్మక మార్పులు వచ్చాయి. మొబైల్ ఆపరేటర్ల మధ్య పోటీ తీవ్రమైంది. వినియోగదార్లను ఆకట్టుకునేందుకు వినూత్నమైన ప్లాన్లను తీసుకువస్తున్నారు. తాజాగా ఎయిర్ టెల్ రూ.179 ప్లాన్ తో జీవిత బీమా సౌకర్యం అందిస్తోంది.

ఈ ప్లాన్ విలువ రూ.179 కాగా, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకుంటే ఏ నెట్ వర్క్ కు అయినా అన్ లిమిటెడ్ కాలింగ్, 2జీబీ డేటా, 300 ఎస్సెమ్మెస్ లు లభిస్తాయి. అంతేకాదు, భారతీ ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా రూ.2 లక్షల బీమా సదుపాయం కలుగుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరంలేదు. ఎయిర్ టెల్ ఈ బీమాకు సంబంధించిన డిజిటల్ డాక్యుమెంట్స్ ను వినియోగదారుడికి నేరుగా పంపిస్తుంది. కావాలనుకుంటే పేపర్ డాక్యుమెంట్ రూపంలోనూ పత్రాలు అందిస్తారు.

India
Airtel
Prepaid
Life Insurence
179 Plan
Bharti Axa
  • Loading...

More Telugu News