: సిటీ తమ్ముళ్ళపై బాబు ఆగ్రహం
నగర టీడీపీ నేతలపై అధినేత చంద్రబాబు నాయుడు నేడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల స్థాయిలో తలపెట్టిన మినీ మహానాడు నిర్వహణలో వర్గపోరు తారస్థాయికి చేరిన నేపథ్యంలో బాబు స్పందించారు. జూబ్లీహిల్స్, అంబర్ పేట నియోజకవర్గాల్లో నేతలు ఎవరికివారే విడివిడిగా మినీ మహానాడు జరపడంతో బాబు ఆ కార్యక్రమాన్ని రద్దు చేయాలంటూ ఆదేశించారు. అయినా, లక్ష్యపెట్టని జూబ్లీ హిల్స్ టీడీపీ కార్పొరేటర్లు మురళీ గౌడ్, సదాశివ యాదవ్, విజయలక్ష్మి మినీ మహానాడు కొనసాగించాలనే నిశ్చయించుకున్నారు. దీంతో, వారిపై చర్యలు తీసుకోవాలని బాబు భావిస్తున్నట్టు సమాచారం.