Cricket: ఈ అర్హతలు ఉన్నవాళ్లు సెలెక్టర్ పదవికి దరఖాస్తు చేసుకోండి... బీసీసీఐ ప్రకటన

  • ముగిసిన ఎమ్మెస్కే, ఖోడా పదవీకాలం
  • రెండు సెలెక్టర్ పోస్టులకు బీసీసీఐ నోటిఫికేషన్
  • దరఖాస్తులకు ఆఖరు తేదీ జనవరి 24

బీసీసీఐ సీనియర్ సెలెక్షన్ ప్యానెల్ లో మార్పులు జరగనున్నాయి. చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, సెలెక్టర్ గగన్ ఖోడాల పదవీకాలం ముగియడంతో కొత్త సెలెక్టర్ల కోసం బీసీసీఐ ప్రకటన ఇచ్చింది. సెలెక్టర్ పదవి కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు నియమావళి కూడా ప్రకటించారు. సీనియర్ సెలెక్షన్ కమిటీ సభ్యుల వయసు 60 ఏళ్ల లోపు ఉండాలి. కెరీర్ లో కనీసం 7 టెస్టులు కానీ, 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు కానీ ఆడిన అనుభవం ఉండాలి. లేదా, 10 వన్డేలు కానీ, 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు కానీ ఆడిన అనుభవం ఉండాలి. ఐదేళ్ల కిందట, లేదా అంతకుముందే క్రికెట్ కు గుడ్ బై చెప్పినవాళ్లే అర్హులు. దరఖాస్తులు పంపుకోవడానికి ఆఖరు తేదీ జనవరి 24. కాగా కొత్త సెలెక్టర్లను ఎంపిక చేయడానికి క్రికెట్ సలహా సంఘం ఏర్పడాల్సి ఉంది.

Cricket
BCCI
Selectors
India
Team India
  • Loading...

More Telugu News