Telangana: బావిలో శవమై తేలిన మెడికో... కాళ్లు, చేతులు కట్టేసిన స్థితిలో మృతదేహం

  • ఖమ్మంలో మెడిసిన్ చదువుతున్న వంశీ
  • సంక్రాంతి సెలవుల అనంతరం ఖమ్మం పయనం
  • అనూహ్య రీతిలో వ్యవసాయబావిలో శవమై తేలిన వైనం

ఖమ్మంలో ఓ మెడికల్ కాలేజీలో చదువుతున్న తుమ్మలపల్లి వంశీ అనే మెడికో అనుమానాస్పద స్థితిలో బావిలో శవమై తేలాడు. అతడి చేతులు, కాళ్లు కట్టేసి ఉండడంతో హత్య అని భావిస్తున్నారు. వంశీ స్వస్థలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కనిపర్తి. ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్న వంశీ సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చాడు. శుక్రవారం తిరిగి ఖమ్మం వెళ్లాడు.

ఆ సాయంత్రం కుటుంబసభ్యులకు ఫోన్ చేసి కాలేజీకి చేరినట్టు సమాచారం అందించాడు. కానీ, ఆ మరుసటి రోజు తండ్రి పొలానికి వెళ్లగా అక్కడి వ్యవసాయబావి వద్ద వంశీ బ్యాగు, చెప్పుల జత కనిపించాయి. బావిలో చూడగా వంశీ శవం కనిపించింది. దాంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పొలంలో బావి వద్ద ఏర్పాటుచేసిన సీసీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలిస్తే కీలక సమాచారం లభ్యమవుతుందని పోలీసులు భావిస్తున్నారు.

Telangana
Khammam
Jayashankar Bhupalpally District
Kaniparthi
Vamsi
MBBS
  • Loading...

More Telugu News