Ntr: 'ఆర్ ఆర్ ఆర్' విడుదల తేదీ వాయిదా?

  • షూటింగు దశలో 'ఆర్ ఆర్ ఆర్'
  • ముందుగా చెప్పిన రిలీజ్ డేట్ జూలై 30
  • దసరా బరిలోకి దిగనుందా? 

రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' సినిమా రూపొందుతోంది. ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరీస్ .. చరణ్ జోడీగా ఆలియా భట్ నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 70 శాతం చిత్రీకరణను జరుపుకుంది. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాను జూలై 30వ తేదీన విడుదల చేయనున్నట్టుగా కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు.

అయితే ఈ సినిమా షూటింగు మధ్యలో ఏర్పడిన కొన్ని అంతరాయాల వలన .. సాంకేతిక కారణాల వలన వాయిదా పడే అవకాశాలు వున్నాయనే టాక్ వినిపించింది. ఆ వార్త నిజమేనన్నట్టుగా ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశాడు. తనకు అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్లో విడుదల కానుందని తెలియజేశాడు. అంటే 'ఆర్ ఆర్ ఆర్' దసరా బరిలోకి దిగుతుందనే అనుకోవాలి.

  • Loading...

More Telugu News