NTR: అభిమానులతో నిండిపోయిన ఎన్టీఆర్ ఘాట్.. నివాళులర్పించిన కుటుంబ సభ్యులు

  • నేడు ఎన్టీఆర్ 24వ వర్ధంతి
  • నివాళులు అర్పించిన నందమూరి కుటుంబ సభ్యులు
  • పెద్ద ఎత్తున తరలివచ్చిన కుటుంబ సభ్యులు

హైదరాబాద్‌, నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ అభిమానులు, కుటుంబ సభ్యులతో నిండిపోయింది. ఎన్టీఆర్ 24వ వర్ధంతి సందర్భంగా ఘాట్ వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. కేంద్రమాజీ మంత్రి, బీజేపీ నేత పురంధేశ్వరి, నటులు కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్, నందమూరి సుహాసిని, రామకృష్ణ తదితరులు ఘాట్ వద్దకు చేరుకుని నివాళులర్పించారు. మరోవైపు, ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఘాట్ చుట్టూ ప్రదక్షిణలు చేసి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

NTR
Junior NTR
Kalyan Ram
Tribute
  • Loading...

More Telugu News