India: ఆసీస్ పై లెక్క సరిచేసిన టీమిండియా... రాజ్ కోట్ వన్డేలో విజయం!

  • తొలి వన్డే ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న భారత్
  • రెండో వన్డేలో 36 పరుగులతో విక్టరీ
  • 341 పరుగుల లక్ష్యఛేదనలో 304 పరుగులకే ఆలౌటైన ఆసీస్

తొలి వన్డేలో ఎదురైన ఘోర పరాజయానికి భారత్ బదులు తీర్చుకుంది. రాజ్ కోట్ లో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 36 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన భారత్ మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 340 పరుగులు చేసింది. ఆ తర్వాత భారీ లక్ష్యఛేదనకు ఉపక్రమించిన ఆసీస్ 49.1 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (98), లబుషేన్ (46) పోరాడినా ఫలితం దక్కలేదు.

రెండు వికెట్లు సాధించడం ద్వారా కుల్దీప్ యాదవ్ మ్యాచ్ ను మలుపుతిప్పగా, షమీ (3), సైనీ (2), జడేజా (2) సమయోచితంగా రాణించి జట్టు విజయంలో పాలుపంచుకున్నారు.  ఈ విజయంతో భారత్ మూడు వన్డేల సిరీస్ ను 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య చివరిదైన మూడో వన్డే జనవరి 19 ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.

India
Australia
ODI
Rajkot
Cricket
  • Loading...

More Telugu News