Nirbhaya: నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుకు కొత్త తేదీ ఖరారు.. డెత్ వారెంట్ జారీ

  • పిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు ఉరితీత
  • క్షమాభిక్షను ఈరోజు ఉదయం తిరస్కరించిన రాష్ట్రపతి
  • చట్టం ప్రకారం ఈరోజు నుంచి 14వ రోజున అమలుకానున్న శిక్ష

నిర్భయ దోషుల ఉరిశిక్షకు కొత్త తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 6 గంటలకు ఉరిశిక్షను అమలు చేయనున్నారు. ఈ మేరకు డెత్ వారెంట్ జారీ అయింది. ఢిల్లీలోని తీహార్ జైల్లో నలుగురు దోషులను ఉరి తీయనున్నారు. దోషుల్లో ఒకడైన ముఖేశ్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్ ను ఈ ఉదయం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో చట్టం ప్రకారం సరిగ్గా ఈ రోజు నుంచి 14వ రోజున ఉరిశిక్షను అమలు చేయబోతున్నారు. క్షమాభిక్షను నిరాకరించిన పక్షంలో చట్టం ప్రకారం ఉరిశిక్ష విధించడానికి రెండు వారాల గడువు ఉండాలి. వాస్తవానికి ఈనెల 22న నలుగురు దోషులకు ఉరిశిక్షను అమలు చేయాల్సి ఉంది. క్షమాభిక్ష పిటిషన్ నేపథ్యంలో... దోషులకు మరో 10 రోజులు జీవించే అవకాశం కలిగింది.

Nirbhaya
Convicts
Death Sentence
  • Loading...

More Telugu News