Exams: ఆలిండియా సీఏ ఫైనల్ ఎగ్జామ్స్ ర్యాంకర్లకు సీఎం జగన్ అభినందనలు

  • జి.కృష్ణప్రణీత్ కు ఫస్ట్ ర్యాంక్
  • 46వ ర్యాంకు సాధించిన ఆంజనేయ వరప్రసాద్
  • మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశీర్వదించిన సీఎం

ఆలిండియా సీఏ ఫైనల్ ఎగ్జామ్స్ లో మొదటి ర్యాంకు సాధించిన జి.కృష్ణప్రణీత్ ను ఏపీ సీఎం వైఎస్ జగన్ మనస్ఫూర్తిగా అభినందించారు. సీఎం జగన్ ను కృష్ణప్రణీత్ తో పాటు 46వ ర్యాంకర్ వి.ఆంజనేయ వరప్రసాద్ కూడా కలిశారు. వారు సాధించిన ఘనత పట్ల జగన్ సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ వారు మరిన్ని ఘనతలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఆలిండియా స్థాయిలో సీఏ ఫైనల్ ఎగ్జామ్స్ గత నవంబరులో జరిగాయి. తాజాగా ఫలితాలు వెల్లడయ్యాయి.

Exams
Rank
Jagan
YSRCP
Andhra Pradesh
All India CA
  • Loading...

More Telugu News