hajipur: నేడు విచారణకు రానున్న హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాసరెడ్డి కేసు!

  • సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యలు
  • తనకే పాపం తెలియదన్న నిందితుడు శ్రీనివాస్
  • నేటి విచారణపై సర్వత్ర ఉత్కంఠ

నల్గొండ జిల్లా హాజీపూర్ సీరియర్ కిల్లర్ శ్రీనివాసరెడ్డి కేసు నేడు విచారణకు రానుంది. హాజీపూర్‌లో గతేడాది వెలుగులోకి వచ్చిన బాలికల వరుస హత్యలు సంచలనం సృష్టించాయి. ఈ కేసులో నిందితుడు శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు అన్ని సాక్ష్యాలు సేకరించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే వాదనలు ముగిశాయి. ఈ హత్యలను శ్రీనివాసరెడ్డే చేశాడని చెప్పేందుకు పక్కా ఆధారాలు ఉన్నాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇప్పటికే కోర్టుకు నివేదించారు.

నిందితుడికి ఉన్న నేరచరిత్ర దృష్ట్యా ఈ కేసును అత్యంత అరుదైనదిగా పరిగణించాలని, శ్రీనివాసరెడ్డికి మరణశిక్ష విధించాలని గత విచారణలో కోర్టును కోరారు. నిందితుడి తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ బాలికల వరుస హత్యలకు, తన క్లయింట్‌కు సంబంధం లేదన్నారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. నేడు తిరిగి విచారణ ప్రారంభం కానుండడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.

hajipur
Nalgonda District
killer srinivas
  • Loading...

More Telugu News