Nagarkurnool District: తిమ్మాజీపేట త్రిశూల్ వైన్స్ అంటే ఎంతో డిమాండ్ మరి!

  • ఉన్నది ఒకే వైన్ షాపు
  • బెల్ట్ షాపుల్లో అధిక ధరలకు విక్రయం
  • వైన్స్ షాపు ముందు బారులు తీరిన జనం

అది తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ఉన్న వైన్ షాప్. చుట్టుపక్కలా, దాదాపు 10 కిలోమీటర్ల పరిధి వరకూ మరో షాపు కనిపించదు. అయితే ఏం? ప్రతి రెండు కిలోమీటర్లకూ ఓ బెల్టు షాపు అనధికారికంగా నడుస్తూనే ఉంటుంది. అయితే, ఎంఆర్పీ ధరలతో పోలిస్తే, అక్కడ అధికంగా ధర చెల్లించాలి.

అసలే కనుమ పండగ. ప్రతి ఒక్కరూ మందు కావాలని కోరుకుంటారు. డబ్బులు ఎందుకు ఎక్కువ చెల్లించాలని అనుకున్నారో ఏమో? తిమ్మాజీపేటకు పోటెత్తారు. ఉన్న ఒకే షాపును తెరిచేవరకూ అక్కడ మద్యం కోసం ఎదురుచూశారు. క్యూలో ఉంటేనే మద్యం ఇస్తామని షాపు యాజమాన్యం తేల్చి చెప్పడంతో ఇలా లైన్లో నిలబడ్డారు.

Nagarkurnool District
Timmajipeta
Wines
  • Loading...

More Telugu News