Prakasam District: నీటిలో కొట్టుకుపోతున్న ఇద్దరిని తన చీరతో కాపాడిన మహిళ!

  • గుంటూరు జిల్లా ఈపూరు సమీపంలో ఘటన
  • అద్దంకి బ్రాంచ్ కాలువలో పడ్డ బైక్
  • ఇద్దరిని కాపాడిన వ్యక్తి, మహిళ

ఓ వ్యక్తి, ఓ మహిళ చూపిన సమయస్ఫూర్తి, నీళ్లల్లో పడి కొట్టుకుపోతున్న రెండు ప్రాణాలను కాపాడింది. గుంటూరు జిల్లా, ఈపూరు మండల పరిధిలోని బొగ్గరం వద్ద అద్దంకి బ్రాంచ్ కెనాల్ లో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే, శావల్యాపురం మండలానికి చెందిన అన్నదమ్ములు గుంటుపల్లి శివశంకర్, శివసాయి కిరణ్‌ ఓ ద్విచక్రవాహనంపై వెళుతూ, అదుపుతప్పి, కెనాల్లో పడిపోయారు.

వారి అరుపులు విని పక్కనే ఉన్న పొలంలో పని చేసుకుంటున్న చేకూరి వెంకటనర్సయ్య తొలుత అక్కడికి వచ్చాడు. తన లుంగీతో వారిని కాపాడాలని చూడగా, అది వారి చేతులకు అందడం లేదు. ఈలోగా మిర్చి కోతల నిమిత్తం ఆటోలో వెళుతున్న ఓ మహిళా కూలీ, తన ఒంటిపై ఉన్న చీరను తీసి ఇచ్చింది. చీర సాయంతో వారిద్దరూ తమ ప్రాణాలను కాపాడుకోగా, అనంతరం స్థానికులు నీటిలో పడిన బైక్‌ ను వెలికితీశారు. రెండు ప్రాణాలు కాపాడేందుకు రైతు, మహిళా కూలీ చూపిన సమయస్ఫూర్తిని పలువురు అభినందించారు.

Prakasam District
Addanki
Branch Cannel
Saree
Lady
  • Loading...

More Telugu News