Allu Arjun: భార్య సిగ్గుపడుతుంటే 'సామజ వర గమనా...' పాడిన బన్నీ... అల్లు శిరీశ్ షేర్ చేసిన వీడియో ఇదిగో!

  • సంక్రాంతి సంబరాల్లో అల్లు, కొణిదెల ఫ్యామిలీ
  • ప్రత్యేక సంగీత విభావరి ఏర్పాటు
  • భార్య ముందు గొంతు కలిపిన అల్లు అర్జున్

'అల వైకుంఠపురములో..' చిత్రంలోని "సామజ వర గమనా... నిను చూసి ఆగగలనా.." పాట ఎంత సూపర్ హిట్టో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. తాజాగా, అల్లు, కొణిదెల కుటుంబాలు సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఒకే చోట చేరగా, స్పెషల్ ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేశారు. ఓ గాయకుడు 'సామజ వర గమనా...' పాటను ఆలపిస్తుంటే, అల్లు అర్జున్ అతనితో గొంతు కలిపారు.

ఈ సమయంలో పక్కనే ఉన్న బన్నీ భార్య స్నేహారెడ్డి, భర్తను పట్టుకుని తెగ సిగ్గుపడిపోయింది. ఇప్పటికే 'సో క్యూట్' కపుల్ గా పేరు తెచ్చుకున్న ఈ జంట స్పెషల్ వీడియోను అల్లు శిరీశ్ రికార్డు చేసి, తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ సీజన్ లో నాకు నచ్చిన పాట, నాకు ఇష్టమైన ఇద్దరు అని శిరీశ్ కామెంట్ మెట్టారు. ఇంకేముంది నిమిషాల వ్యవధిలో ఈ వీడియో వైరల్ అయింది.

Allu Arjun
Snehareddy
Ala Vaikunthapuramulo
Samajavaragamana
Allu Sirish
Instagram
  • Loading...

More Telugu News