Nirbhaya: మరో చాన్స్ మిస్... నిర్భయ దోషి ముఖేష్ సింగ్ కు క్షమాభిక్ష తిరస్కరణ!

  • క్షమాభిక్ష తిరస్కరించిన ఢిల్లీ ఎల్జీ
  • ఫైల్ తిరిగి కేంద్ర హోమ్ శాఖ వద్దకు
  • 22న ఉరి తీసేందుకు ఏర్పాట్లు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచార ఘటనలో దోషులను ఉరి తీసేందుకు సమయం దగ్గర పడింది. దోషుల్లో ఒకడైన ముఖేష్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తోసిపుచ్చారు. తన వద్దకు వచ్చిన ఈ పిటిషన్ ను తిరస్కరించిన ఆయన, తిరిగి దాన్ని కేంద్ర హోమ్ శాఖకు పంపారు.

 దీంతో ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు ముఖేష్ ముందున్న మరో చాన్స్ మిస్ అయింది. ఇప్పటికే ఈ కేసులో పాటియాలా హౌస్ కోర్టు దోషులపై డెత్ వారెంట్ ను జారీ చేసిన సంగతి తెలిసిందే. దోషులను 22న ఉరి తీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Nirbhaya
Mukesh
Mercy
Petition
New Delhi
LG
  • Loading...

More Telugu News