Amaravati: పాలకొల్లులో మూడు రాజధానులపై ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తున్న టీడీపీ

  • పాలన వికేంద్రీకరణ కోసమే అంటున్న మంత్రులు 
  • రాజధాని తరలింపును వ్యతిరేకిస్తున్న విపక్షాలు 
  • కార్యక్రమంలో పాల్గొన్న నిమ్మల రామానాయుడు, అంగర రామ్మోహన్

అమరావతి నుంచి రాజధాని తరలింపు, మూడు రాజధానులంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు ఏపీలో వేడి పుట్టిస్తున్నాయి. పాలన వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులు అంటూ మంత్రులు చేస్తున్న ప్రకటనలను విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ రాష్ట్రంలోని అన్ని విపక్ష పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో, అమరావతి, మూడు రాజధానుల అంశంపై పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో తెలుగుదేశం పార్టీ ప్రజా బ్యాలెట్ ను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ లు పాల్గొన్నారు.  

Amaravati
Telugudesam
Telugudesam
Nimmala Ramanaidy
Angara Ram Mohan
Palakollu
  • Loading...

More Telugu News