Mamata Banerjee: ఎన్నార్సీపై సమావేశానికి డుమ్మా కొట్టనున్న టీఎంసీ

  • ఎన్నార్సీపై రేపు సమావేశాన్ని నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం
  • ఎన్నార్సీని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న మమత
  • తన మరణం తర్వాతే అది సాధ్యమంటూ వ్యాఖ్య

ఎన్నార్సీపై ఢిల్లీలో రేపు కేంద్ర ప్రభుత్వం సమావేశాన్ని నిర్వహించబోతోంది. అయితే ఈ సమావేశానికి మమతాబెనర్జీకి చెందిన టీఎంసీ డుమ్మా కొట్టబోతోంది. దీనిపై మమత మాట్లాడుతూ, కావాలనుకుంటే తమ ప్రభుత్వాన్ని కేంద్రం పడగొట్టుకోవచ్చని వ్యాఖ్యానించారు. మొదటి నుంచి కూడా ఎన్నార్సీని మమత వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.

పశ్చిమబెంగాల్ లో కేంద్ర ప్రభుత్వం ఎన్నార్సీని అమలు చేయాలనుకుంటే... అది తన మరణం తర్వాతే సాధ్యమని మమత ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత వారం ఓ సభలో ఆమె మాట్లాడుతూ, ప్రజల హక్కులకు తాను కాపలాదారుని అని చెప్పారు. ఎన్నార్సీని అమలు చేయడం అనుకున్నంత సులభం కాదని... ఎవరూ భయపడవద్దని అన్నారు.

Mamata Banerjee
TMC
NRC
  • Loading...

More Telugu News