Kanna Lakshminarayana: రాజధానిపై పోరుకి సిద్ధమవుతున్నాం: కన్నా లక్ష్మీనారాయణ

  • కీలక వ్యాఖ్యలు చేసిన కన్నా లక్ష్మీ నారాయణ 
  • జగన్ అనుభవ రాహిత్యం, నియంతృత్వ ధోరణి వల్ల రాష్ట్రానికి నష్టం 
  • జగన్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాజధానిపై త్వరలోనే తమ పార్టీ పోరుబాటకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ అనుభవ రాహిత్యం, నియంతృత్వ ధోరణి వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని ఆయన తెలిపారు. మూడు రాజధానులపై జగన్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన సూచించారు.

కాగా, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవలే ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిసి వచ్చిన విషయం తెలిసిందే. రేపు జనసేన, బీజేపీ నేతలు విజయవాడలో కీలక సమావేశంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో కన్నా లక్ష్మీ నారాయణ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

Kanna Lakshminarayana
BJP
Andhra Pradesh
  • Loading...

More Telugu News