Vijayawada: విజయవాడలో రేపు జనసేన, బీజేపీ కీలక భేటీ

  • ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిసి వచ్చిన పవన్
  • రేపటి భేటీలో ఏపీ రాజధానిపై చర్చించే అవకాశం
  • రాజధానిని మార్చడం సరికాదన్న కన్నా లక్ష్మీనారాయణ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవలే ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిసి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 16న జనసేన, బీజేపీ నేతలు విజయవాడలో కీలక సమావేశంలో పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని సమస్యలపై ఇరు పార్టీలు కలిసి పోరాడతాయని తెలుస్తోంది. అమరావతి రాజధాని ఉద్యమం ఏపీలో ఉవ్వెత్తున ఎగిసిపడుతోన్న నేపథ్యంలో దీనిపై ఇరు పార్టీల నేతలు రేపు చర్చించనున్నట్లు సమాచారం.

ఈ విషయంపై ఈ రోజు బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ స్పందించారు. రాష్ట్ర అభివృద్ధిపై తమ పార్టీ మొదటి నుంచి ఒకే మాటపై ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని తమ మేనిఫెస్టోలో పెట్టామని చెప్పారు. ఏపీ సీఎం మారినప్పుడల్లా రాజధానిని మార్చడం సరికాదన్నారు. రేపటి భేటీ అనంతరం ఇరు పార్టీల నేతలు ఏయే విషయాలు ప్రకటిస్తారన్న ఉత్కంఠ నెలకొంది.

Vijayawada
Jana Sena
BJP
  • Loading...

More Telugu News