Nayanatara: 12 ఏళ్ల తరువాత మళ్లీ మోసం చేసిన మురుగదాస్... వాపోతున్న నయనతార!

  • మురుగదాస్ దర్శకత్వంలో గజనీ చిత్రంలో నటించిన నయన్
  • తాజాగా దర్బార్ లో రజనీ సరసన
  • జూనియర్ ఆర్టిస్ట్ కన్నా ఘోరంగా చూపారట
  • తప్పు చేశానంటున్న నయనతార

దాదాపు పుష్కర కాలం క్రితం సూర్య, అసిన్ జంటగా వచ్చిన 'గజనీ' చిత్రంలో తనకు ప్రాధాన్యత లేని పాత్రను ఇచ్చి మోసం చేసిన దర్శకుడు మురుగదాస్, ఇప్పుడు మరోసారి తనను మోసం చేశాడని నయనతార వాపోతోంది. తాజాగా, రజనీ సరసన నయనతార నటించిన 'దర్బార్' చిత్రంలో హీరోయిన్ తానే అయినా, రజనీ కుమార్తెగా నటించిన నివేద థామస్ కు ఇచ్చిన విలువలో సగం కూడా తనకు ఇవ్వలేదని, తనను ఓ జూనియర్ ఆర్టిస్ట్ గా చూపించారని ఈ సీనియర్ నటి అంటోంది.

ఇక నయన్ ఫ్యాన్స్ సైతం ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. ఎన్నో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలతో తన సత్తాను చాటి, కోట్లాది మంది అభిమానాన్ని పొందిన నయన్, అసలు ఇటువంటి సినిమాను ఎందుకు ఒప్పుకుందని ప్రశ్నిస్తున్న వారూ లేకపోలేదు.

 సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చేస్తున్న విమర్శలతో మరింత అశాంతికి గురవుతున్న నయన్, మురుగదాస్ గజనీ సినిమాలో నటించి తప్పు చేసిన తాను, మరోసారి అతని సినిమాలో నటించేందుకు అంగీకరించి, తప్పు చేశానని, అందుకు ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నానని అంటోందట.

Nayanatara
Murugadas
Darbar
Ghajani
  • Loading...

More Telugu News