road: తమ గ్రామంలోని రోడ్డును బాగు చేసుకున్న విద్యార్థులు

  • మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ జిల్లా ధమన్‌గావ్‌రాజూర్‌లో ఘటన
  • బడికి వెళ్లకుండా రోడ్డు పనుల్లో పాల్గొన్న చిన్నారులు
  • కిలోమీటరు మేర రోడ్డు బాగు చేసుకున్న విద్యార్థులు

తమ ఊరి రోడ్డుని తామే బాగుచేసుకోవాలని విద్యార్థులంతా భావించారు. బడికి డుమ్మా కొట్టి మరీ పనులు ప్రారంభించారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ జిల్లా ధమన్‌గావ్‌రాజూర్‌లో గతేడాది ముఖ్యమంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన పథకం కింద రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు. అయితే, పలు కారణాల వల్ల ఈ పనులను మధ్యలోనే వదిలేశారు. 18 కిలోమీటర్ల ఆ రోడ్డు పనులు ఆగిపోవడంతో గ్రామంలోకి బస్సులు కూడా రావట్లేదు.

 ఆ గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న దభాదీ గ్రామంలో స్కూలు ఉండడంతో విద్యార్థులు అక్కడకు వెళ్లడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతేడాది డిసెంబర్‌ నుంచి ఇదే పరిస్థితి. ఈ నెల 10న స్కూలు మానేసిన పిల్లలు కిలోమీటర్‌ మేర రోడ్డును బాగుచేసుకుని ఆదర్శంగా నిలిచారు. మరోపక్క, 18 కిలోమీటర్ల ఆ రోడ్డు పనులను ఈ ఏడాది మార్చిలోగా పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News