Andhra Pradesh: జనసేనతో పొత్తు గురించి ఎలాంటి సమాచారం లేదు: ఏపీ బీజేపీ చీఫ్ కన్నా

  • జేపీ నడ్డాను కలిసిన పవన్
  • బీజేపీ, జనసేన కలిసి పనిచేస్తాయంటూ ప్రచారం
  • హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందన్న కన్నా

జనసేనాని పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను కలిసి చర్చలు జరిపిన నేపథ్యంలో ఇరు పార్టీలు ఏపీలో కలిసి పనిచేసేందుకు ఓ అవగాహనకు వచ్చాయని ప్రచారం జరిగింది. దీనిపై ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు.

ఏపీలో బీజేపీ, జనసేన పొత్తు గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ పొత్తు ఉండాలని భావిస్తే దానిపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. టీడీపీతో పొత్తుకు మాత్రం బీజేపీ ఎప్పుడో తలుపులు మూసేసిందని అన్నారు. కాగా, ఈ నెల 16న బీజేపీ జాతీయనేతలు విజయవాడ వస్తున్నారని కన్నా తెలిపారు.

Andhra Pradesh
Amaravati
Pawan Kalyan
Jana Sena
Kanna Lakshminarayana
BJP
JP Nadda
  • Loading...

More Telugu News