Muncipal Elections: కరీంనగర్ మినహా ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు

  • కరీంనగర్ లో ఉపసంహరణ గడువు 16 వరకు పొడిగింపు
  • ఈ నెల 22న పోలింగ్.. 25న ఓట్ల లెక్కింపు
  • కరీంనగర్ లో మాత్రం 25న పోలింగ్..27న ఓట్ల లెక్కింపు

తెలంగాణలో మునిసిపాలిటి ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఈరోజు సాయంత్రం ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా వెలువడనుంది.  కాగా, 120 మున్సిపాలిటిలు, 9 నగరపాలక సంస్థలకు ఈ నెల 22న పోలింగ్, 25వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.

కాగా, కరీంనగర్ నగరపాలక సంస్థలో నామినేషన్ల ఉపసంహరణ గడువును మాత్రం ఈ నెల 16 వరకు పొడిగించారు. ఈ నెల 25న పోలింగ్ జరగనుండగా, 27న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

కామారెడ్డిలో ‘కాంగ్రెస్’ అభ్యర్థుల ఆందోళన

ఇదిలా ఉండగా, కామారెడ్డి మున్సిపాలిటి కేంద్రం వద్ద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆందోళననకు దిగారు. కౌన్సిలర్ టికెట్ల కేటాయింపులో వివక్ష చూపారంటూ సీనియర్ నేత  షబ్బీర్ అలీ, ఆయన సోదరుడు నయీంపై ఆరోపణలు చేశారు.

Muncipal Elections
Telangana
Karimnagar
Naminations withdraw
120 Municipalities
9 corporations
  • Loading...

More Telugu News